Thursday, March 28, 2024

పెట్రోల్‌, డీజిల్‌ వాడకం తగ్గిస్తే 40 శాతం తగ్గనున్న కాలుష్యం

దేశంలో కాలుష్యానికి ప్రధానంగా డీజిల్‌, పెట్రోల్‌ వినియోగమే కారణమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తే కాలుష్యం 40 శాతం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం మన దేశం 16 లక్షల కోట్ల విలువైన డీజిల్‌, పెట్రోల్‌ వంటి శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటుందని చెప్పారు. ఇవి కాలుష్యానికి ప్రధాన కారణమేకాకుండా, దేశ ఆర్ధిక వ్యవస్థకు పెద్ద సవాల్‌గా ఉన్నాయన్నారు. వీటితో పాటు మన దేశం ప్రతి సంవత్సరం 12 లక్షల కోట్ల విలువై బొగ్గును దిగుమతి చేసుకుంటున్నామని గడ్కరీ చెప్పారు. వీటి వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఎనర్జీ వినియోగానికి సంబంధించి టెక్నాలజీ అభివృద్ధి చేయడంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు. కాలుష్య కారకాలైన శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించేందుకు సాంకేతికను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వాటి పై ఉందన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని సాధించాలిన భారత్‌ లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మొత్తం విద్యుత్‌ ఉత్పత్తిలో సోలార్‌ ఎనర్జీ వాటా 38 శాతంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement