Friday, March 29, 2024

మైసూరులో ఇంటి అద్దెకు పోలీసు సర్టిఫికేట్‌ తప్పనిసరి

మంగుళూరు ఆటో రిక్షాలో పేలుడు నేపథ్యంలో, రాష్ట్రంలో భద్రతను #హఅలర్ట్‌లోకి తీసుకురావడానికి, మైసూరు పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నగరంలోని అద్దెదారులకు కీలక సూచనలు చేశారు. కొత్త రెంటల్‌ పాలసీ ప్రకారం, ఏ వ్యక్తికైనా ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు యజమానులు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ నుండి క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ పొందాల్సి ఉంటుంది. మంగళూరు పేలుళ్ల కేసులో ఉగ్రవాద అనుమానితుడు షరీఖ్‌ మైసూరులో ఇల్లు అద్దెకు తీసుకునేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.

కొత్త రూల్స్‌ ప్రకారం, రూ.100 దరఖాస్తు రుసుముతో, పోలీసు స్టేషన్‌లో క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ రూపొందించాలి. బ్యాచిలర్‌, కుటుంబం, పేయింగ్‌ గెస్ట్‌ యజమానులకు వేర్వేరు దరఖాస్తులు ఉన్నాయి. స్టేషన్‌లో తమ అద్దెదారుల గురించి సమాచారాన్ని అందించాలని, ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని యజమానులందరికీ సూచిస్తూ పోలీసు కమిషనర్‌ నోటీసు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement