Thursday, April 25, 2024

ముంపు తేలితేనే ‘పోల‌వ‌రం’ ముందుకు..

పోలవరంపై నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర జలసంఘం
టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీకి బాధ్యతలు
త్వరలోనే అన్ని రాష్ట్రాల ఈఎన్‌సీల సమావేశం
సీఎంలతో భేటీ తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక

అమరావతి, ఆంధ్రప్రభ: పోలవరం వెనుక జలాల (బ్యాక్‌ వాటర్‌) ముంపుపై పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చించేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) -టె-క్నికల్‌ అడ్వయిజరీ కమిటీ- (టీ-ఏసీ) మరో రెండు వారాల్లోపు కీలక సమావేశం నిర్వహించ నుంది. ఏపీతో పాటు- పోలవరం సరిహద్దు రాష్ట్రాల జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ)లతో ఈనెల 13న శుక్రవారం నిర్వహించ తలపెట్టిన సమావేశాన్ని సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వాయిదా వేశారు. అతి త్వరలోనే ఈ సమావేశాన్ని నిర్వహించి ముంపుపై ఉన్న అనుమానాలు, నిర్మాణాలపై ఉన్న అభ్యంతరాలపై అన్ని రాష్ట్రాల నుంచి సీడబ్ల్యూసీ ఇప్పటికే రాతపూర్వక నివేదికలు కోరింది. జాతీయ ప్రాజెక్టయిన పోలవరంపై ఏపీతో పాటు- సీడబ్ల్యూసీ కూడా స్పష్టమైన అభిప్రాయంతో ఉంది.

గతనెలలో నిర్వహించిన సమావే శంలో ముంపుపై రీ సర్వే చేయాల్సిన అవసరం లేదనీ, సాంకేతిక అనేక అధ్యయనాలు చేసి ముంపు ఏర్పడదని నిర్దారించాకే అనుమతులిచ్చామని ఆయా రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ అధికారులు వివరించారు. గత ఏడాది వచ్చిన వరదలను ఉటంకిస్తూ తెలంగాణ, ఒడిశాలు అభ్యంతరాలు తీవ్రతరం చేయ టంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఆదేశాల మేర కు ఏపీతో పాటు- అన్ని రాష్ట్రాల అభిప్రాయాలతో సమగ్రమైన సాంకేతిక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే ఈ బాధ్యతలను సీడబ్ల్యూసీ అనుబంధ విభాగమైన -టె-క్నికల్‌ అడ్వయిజరీ కమిటీ- (టీ-ఏసీ) చేపట్టింది. ఈ నెలాఖరులోపు అన్ని రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం నిర్వహించి వచ్చేనెల 15 లోపు ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌ ఘడ్‌, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్య మంత్రులతో సమావేశం ఏర్పాటు- చేయాలని నిర్ణయిం చింది. రెండు సమావేశాల అనంతరం సుప్రీంకోర్టుకు పోలవరం ముంపుపై సమగ్ర నివేదికను అందించనుంది.

గోపాలకృష్ణ, బీఐఎస్‌, ఐఐటి నివేదికల పరిశీలన
గోదావరిలో పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రభావంపై అధ్యయనం చేసేందుకు నియమితమైన గోపాలకృష్ణ కమిటీ- అందించిన నివేదికను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలిస్తోంది. వరద ఉధృతి పెరిగినపుడు బ్యాక్‌ వాటర్‌ ఏ స్థాయిలో ఉంటు-ందీ..దాని ప్రభావం వల్ల భవిష్యత్‌లో ప్రతికూల పరిణామాలు ఏర్పడకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకోవాల్సిన సాంకేతిక అంశాలను అధ్య యనం చేసేందుకు సీడబ్ల్యూసీ గోపాలకృష్ణ కమిటీ-ని నియ మించింది. ఈ కమిటీ-తో పాటు- బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాం డర్డ్స్‌ (బీఐఎస్‌), ఐఐటి హైదరాబాద్‌, ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై అధ్యయనం చేసి నివేదికలు అందించగా..వాటన్నిటినీ క్రోడీకరించి సమగ్ర నివేదికు రూపొందించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అధారిటీ-కి సూచనలు చేసింది.

- Advertisement -

పోలవరంకు 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినపుడు పోలవరం వద్ద డ్యాం నిర్మాణం పూర్తి కాని సమయంలో భద్రాచలం వద్ద 57 అడుగులు, పోలవరం డ్యాం పూర్తయినపునడు 57.02 అడుగులకు నీరు చేరుతుం దని హైదరాబాద్‌ ఐఐటి అధ్యయనంలో వెల్లడయింది. కేంద్ర జలసంఘం నియమించిన గోపాలకృష్ణ నివేదికలో మాత్రం భద్రాచలం వద్ద 56.09, 56.44 అడుగులకు నీరు చేరుతుందని లెక్క తేల్చింది. గోపాలకృష్ణ నివేదికతో పాటు- ఏపీ ప్రభుత్వ నివేదికలోని అధ్యయన అంశాలు దాదాపు ఒకే తరహాలో ఉన్నాయి. పోలవరం వద్ద డ్యాం లేనపుడు భద్రాచలం వద్ద 56.09 అడు గులు, డ్యాం ఉన్నపుడు 56.57 అడుగుల నీటి మట్టం ఉంటు-ందని ఏపీ ప్రభుత్వ అద్యయనం వెల్లడించింది. బ్యూరో ఇండియన్‌ స్టాండర్డ్స్‌ 50 ఏళ్లలో వచ్చే 25.53 లక్షల క్యూసెక్కుల వరదనూ, గోదావరి జలవివాద -టైబ్యునల్‌ మార్గదర్శకాలను అనుసరించి 500 ఏళ్లలో వచ్చే 36 లక్షల క్యూసెక్కుల వరదను పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేసి నివేదిక అందించింది. హైదరాబాద్‌ ఐఐటి మాత్రం వెయ్యేళ్లలో, 10 వేల ఏళ్లలో వచ్చే వరదను ప్లnడ్‌ ప్రీక్వెన్సీ అప్రోచ్‌ ద్వారా అద్యయనం చేసి పోలవరం ఎగువన, దిగువన వచ్చే వరద లెక్కలను వెల్లడించింది. ఈ రెండు సంస్థల అధ్యయనాలను పరిగణలోకి తీసుకుని 25.53 లక్షల క్యూసెక్కులు, 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేసిన గోపాలకృష్ణ కమిటీ- హైదరాబాద్‌ ఐఐటి అధ్యయనాంశాలు హేతుబద్ధంగా లేవన్న అభిప్రా యానికి వచ్చినట్టు- తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement