Thursday, April 18, 2024

‘పోకిరి’ మ‌ళ్లీ వ‌స్తుండు.. రేప‌టి నుంచి థియేట‌ర్ల‌లో ఫుల్ జోష్‌!

ప్రిన్స్​ మహేష్ బాబు పుట్టినరోజు సంద‌ర్భంగా ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా సూపర్‌హిట్ మూవీ ‘పోకిరి’ ప్రత్యేక షోల‌ను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ మూవీ రీ మాస్టర్ చేసి 4K అల్ట్రా HD ఫార్మాట్‌లో విడుదల చేస్తున్నారు. ఈ ఫార్మాట్‌లో రీ రిలీజ్ అవుతున్న‌ మొదటి తెలుగు సినిమాగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే షోలు ప్రదర్శించిందుకు రెడీ చేసిని అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్‌గా ఉన్నట్లు సమాచారం.

ఆయన అభిమానులు సినిమాను పండగలా జరుపుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్ర‌స్తుతం హల్‌చల్ చేస్తున్నాయి. ఈ స్పెష‌ల్ స్క్రీనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ నిర్వహిస్తున్న పిల్లల విద్య, గుండె ఆపరేషన్ల నిధుల కోసం వినియోగించనున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement