Saturday, April 20, 2024

మార్కెట్‌లో పోకో కోత్త మోడల్..

న్యూఢిల్లి : పోకో ఎం-4 ప్రో, 5జీ ఫోన్‌ నేడు గ్లోబల్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. గత వారం స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌పై కంపెనీ ప్రకటన చేసిన తరువాత.. కీలక స్పెసిఫికేషన్స్‌ ఇవేనంటూ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇటీవల లాంచ్‌ అయిన రెడ్‌మీ నోట్‌ 11 రీ బ్రాండెడ్‌ వేరియంట్‌గా ముందుకొస్తుందని చెబుతున్నారు. షియోమి, పోకో కంపెనీలు విభిన్న మార్కెట్లలో తమ రీబ్రాండింగ్‌ ఫోన్‌లను ప్రవేశపెట్టే ఆనవాయితీని కలిగి ఉన్నాయి.

గతేడాది సైతం పోకో రెడ్‌మీ నోట్‌ 10 5జీ ఫోన్‌ను భారత్‌లో పోకో ఎం 3 ప్రో 5జీ పేరుతో రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా లాంచ్‌ చేసింది. ఇక పోకో ఎం4 ప్రో 5జీ గ్రే, ఎల్లో కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. 33 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సామర్థ్యంతో 50 మెగా పిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌, 8 మెగా పిక్సెల్‌ సెకండరీ సెన్సార్‌, 16 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement