Wednesday, March 27, 2024

నేపాల్ లో కూలిన విమానం – 72 మంది దుర్మ‌ర‌ణ?

నేపాల్‌లో 72 సీట్లు కలిగిన ఓ ప్యాసింజర్ విమానం కూలిపోయింది. నేపాల్ లోని పోఖ్రా ఏరియాలో ఈ దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, పాత విమానాశ్రయం మధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషయాన్ని యెతీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు.
ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన కారణంగా పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. కాగా ర‌న్‌వేపై విమానం కూలిపోయిందని అంటున్నారు. అది కూలిన వెంట‌నే పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి.. స‌హ‌య‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసిన‌ట్లు స‌మాచారం..విమాన శిధిలాల నుంచి కొన్ని మృత దేహాల‌ను వెలికి తీశారు.. ఈ ప్ర‌మాదంలో ఎంత‌మంది సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారో వివ‌రాలు వెల్ల‌డి కాలేదు.. విమానంలో ఉన్న 72 మంది మ‌ర‌ణించారంటూ నేపాల్ వెబ్ సైట్ లు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement