Thursday, April 25, 2024

పెండ్లీడు పెంపు యోచన…? మంచిదే అంటున్న నిపుణులు, స్థిరపడ్డాకే పెళ్లంటున్న యువతరం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశంలోనే కాకుండా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంతో పెండ్లీడుపై పెద్ద ప్రభావమే పడుతోంది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల అమలుతో ఇప్పుడు తెలంగాణలో బాల్యవివాహాలు తగ్గాయని కేంద్రంలోని అనేక సర్వేలు వెల్లడించాయి. భారత దేశంలో ఎవరికైనా 18ఏళ్లు నిండితే మేజర్‌గా పరిగణించి ఓటు హక్కు, బ్యాంకు ఖాతా ఇవ్వడం రూల్‌ ప్రకారం జరిగిపోతాయి. అమ్మాయిలకు దీంతోపాటు పెళ్లిడు కూడా అధికారికంగా వచ్చినట్లే. ఆడపిల్లల తల్లిదండ్రులు టీనేజ్‌ దాటిన అమ్మాయిలకు పెళ్లి ఎప్పుడు చేసేద్దామా అనే ఆలోచనలతో సతమవుతూ ఉంటారు. పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని భావించడం సహజంగా జరిగేదే. అయితే ఇప్పుడీ విధానంలో మార్పులు వస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆడపిల్లల పెళ్లి వయసులో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆడపిల్లల పెళ్లిడు వయసును 21ఏళ్లకు పెంచాలని యోచిస్తోంది.

దేశమంతటా ఇప్పుడిలా…

దేశంలో అబ్బాయిలకు పెళ్లి చేయాలంటే 21 సంవత్సరాలు ఉంటే చాలని చట్టం చెబుతోంది. అదే అమ్మాయికైతే 18ఏళ్లుంటే చాటు పెళ్లి చేసేందుకు ఏ అడ్డంకి ఉండదు. కానీ ఇప్పుడీ వ్యవస్థలో మార్పు వచ్చింది. అబ్బాయిలు పెళ్లికాని ప్రసాదులుగా ముదిరిపోతుంటే అమ్మాయిలు ముప్పైకి చేరుతున్న సమయంలో మూడుముళ్లకు సిద్దమవుతున్నారు. ఇక అబ్బాయిలు జీవితంలో స్తిరపడేందుకు పెళ్లిని వాయిదా వేస్తూ ముందుకు వెళుతున్నారు. చదువు, ఉద్యోగం, బిజినెస్‌లో ఒక స్థాయికి వచ్చేంతవరకు గ్యాప్‌ తీసుకుంటున్నారు. ఇందుకు ఎంత లేదన్నా 25ఏళ్ల వయసుదాటిపోతోంది. ఆ తర్వాత లైఫ్‌ సెటిల్‌ అవ్వాలనే లక్ష్యంతో మరో మూడునాలుగేళ్లు సమయం తీసుకుంటున్నారు. దీంతో సుమారు 30ఏళ్లు వచ్చేవరకు బ్రహ్మచారి జీవితంలోనే ఉండిపోతున్నారు.

- Advertisement -

పలు పథకాలతో తగ్గిన బాల్యవివాహాల తాకిడి…

ఇది అబ్బాయిలకే పరిమితం కాలేదు., తాజాగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ సర్కార్‌ తీసుకొచ్చిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకంతో బాల్యవివాహాలే కాదు, మెచ్యూర్డ్‌ ఏజ్‌ దాటేకే అమ్మాయిలు పెళ్లిళ్లకు మొగ్గుచూపిస్తున్నారు. 25 ఏళ్లలోపు పెళ్లికి సిద్దం కావడంలేదు. ఉద్యోగం, అనుకున్న స్థాయిలో ఆర్ధిక ఎదుగుదల, సొంతకాళ్ల మీద నిలబడాలన్న తాపత్రయం, పట్టణాలు, నగరాల్లో జీవన విధానం, హైలైప్‌, ఆర్ధికంగా ఫ్రీడం వంటివి వారి జీవనవిధానాల్లో మార్పులు తెస్తున్నాయి.

ఎన్నో ప్రయోజనాలు…

దేశంలో గడచిని ఎనిమిదేళ్ల క్రితం వరకు పరిస్థితి వేరుగా ఉండేది. ఏటా 1.5 మిలియన్‌ బాల్యవివాహాలు జరిగే స్థితి ఉండగా, రాష్ట్రంలోనూ ప్రధానంగా గిరిజన, ఆదివాసీ, మారుమూల ప్రాంతాల్లో భారీగా బాల్యవివాహాలు జరిగేవి. తెలంగాణ సర్కార్‌ తీసుకొచ్చిన పథకాలు, ఆఈస్పత్రుల్లో ప్రసవాల వంటివాటితో 18ఏళ్లు నిండిన తర్వాత జరిగే వివాహాలతో లాభాలపై అవగాహన వచ్చింది. 18ఏళ్లునిండిన ఆడపిల్లల శరీరం బర్త్‌ కెనాల్‌ ఫార్మేషన్‌ పూర్తిస్థాయిలో సిద్దమవుతుందని, మాతా శిశు మరణాలు తగ్గుతాయనే భరోసా పెరిగింది. ఆడపిల్లలకు 21 ఏళ్ల తర్వాత పెళ్లి అనే విధానంతో విమెన్‌ ఎంపవర్‌మెంట్‌తోపాటు, అడల్ట్‌ మదర్స్‌తో వచ్చే లాభాలు అన్ని సమాజానికి మంచి చేస్తాయని ఒక భావనగా ఉంది. ఆడపిల్లలు మరింత చదువుకునేందుకు, ఉద్యోగాలు చేసేందుకు, ఆరోగ్యపరంగా, ఆలోచనాపరంగా స్పష్టమైన మార్పు దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆడపిల్లలు, పురుషుల వివాహ వయసు పెంపు సమాజంపై మంచి ప్రభావమే చూపిస్తుంది తప్పా ఎటువంటి చెడులేదని ప్రభుత్వాలకు నివేదిక అందింది. ఈ నేపథ్యంలో వివాహ వయో పరిమితి పెంపు దిశగా సానుకూల వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement