Saturday, January 28, 2023

పీయూష్ గోయ‌ల్ క్ష‌మాప‌ణ చెప్పాలి : హ‌రీశ్ రావు

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి హ‌రీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… మా మంత్రుల‌ను అవ‌మానించే హ‌క్కు మీకు ఎక్క‌డిద‌ని ప్ర‌శ్నించారు. మంత్రుల‌ను క‌ల‌వ‌కుండా…బీజేపీ నేత‌ల‌తో మాట్లాడ‌తారా అని అన్నారు. పీయూష్ వ్యాఖ్య‌లు రైతుల‌ను అవ‌మాన ప‌ర్చ‌డ‌మేన‌న్నారు. 70ల‌క్ష‌ల మంది రైతుల త‌ర‌పున మంత్రులు ఢిల్లీ వ‌చ్చార‌న్నారు. త‌న వ్యాఖ్య‌ల‌ను పీయూష్ గోయ‌ల్ వెన‌క్కి తీసుకోవాల‌న్నారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు ఏం చెప్తార‌ని ప్ర‌శ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement