Friday, February 3, 2023

ఖమ్మంకు తరలిన గులాబీ దండు..

భారత రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభ కోసం గులాబీ దండు ఖమ్మంకు తరలి వెళ్లారు. బుధ‌వారం ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు తరలి వస్తున్న వాహనాలను భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర కుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల‌కు చెందిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఖమ్మంకు వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement