Thursday, April 25, 2024

డాక్టర్లపై భౌతిక దాడులు సమాజానికి నష్టం….

జనగామ ప్రభ న్యూస్ : స‌మాజంలో రోగులకు.. డాక్టర్లకు మధ్య నమ్మకంతోనే వైద్యం చేయించుకోవాలని జనగామ జిల్లా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు .. డాక్టర్లు ప్రజల ప్రాణాలను తీయాలనే తపన వారికి ఉండదని.. రోగి ప్రాణాలను కాపాడడమే వైద్య వృత్తి అని.. అలాంటి వైద్యం చేసే డాక్టర్ ల పై దాడి చేయడం సరైంది కాదని రోగికి డాక్టర్లపై నమ్మకంతోనే వైద్యం కొనసాగే విధంగా చూసుకోవాల‌ని తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లపై భౌతిక దాడులకు నిరసనగా డాక్టర్లు.. సిబ్బంది పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు డాక్టర్ లింగారెడ్డి, సీనియర్ డాక్టర్లు, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ లు మాట్లాడుతూ.. వైద్య వృత్తి అనేది శాస్త్రీయంగా రోగుల ప్రాణాలను కాపాడడానికి తప్ప చంపడానికి కాదని.. కానీ సమాజంలో కొందరు డాక్టర్లు ఏదో తప్పు చేశారనే అపనమ్మకం.. భావోద్వేగంతో విచక్షణ కోల్పోయి డాక్టర్ల పై దాడులకు పూనుకోవడం సరైంది కాదన్నారు.

గత మూడు రోజుల క్రితం జనగామ జిల్లా కేంద్రంలో లోటస్ పిల్లల ఆసుపత్రి పై రోగి తాలూకు వ్య‌క్తులు.. డాక్టర్లు.. సిబ్బంది పై దాడి చేయడం సరైంది కాదని ఈ దాడిని ఖండించారు.. ఈ దాడి సమాజానికి నష్టం చేయడమే తప్ప మరేదీ కాదని పేర్కొన్నారు. రోగులు.. డాక్టర్ల వద్దకు వస్తే నమ్మకంతో వైద్యం చేయించుకోవాలని చెప్పారు.. కావాలని ఏ డాక్టర్ రోగిని చంపే ప్రయత్నం చెయ్యరని, బ్రతికించే ప్రయత్నం తప్ప మరేది కాదని ఉండ‌ద‌న్నారు. ఇలాంటి దాడులు చేస్తే సమాజానికి వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు సుముఖంగా సేవలు అందించలేరని, అలాంటప్పుడు రోగులు ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొంటాయని వారు హెచ్చరించారు ఇప్పటికైనా వైద్య సేవలు, డాక్టర్లతో తీసుకోవాలంటే నమ్మకాలతో ముందుకు పోవాలని సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐఎంఏ జనగామ జిల్లా కార్యదర్శి డాక్టర్ శంకర్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ లింగమూర్తి స్వప్న, డాక్టర్ స్వప్న బాలాజీ ,డాక్టర్ అశోక్, డాక్టర్ సుల్తాన్ రాజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement