Wednesday, April 17, 2024

రెండో రోజు తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు

వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ పై 21 పైసలు.. డీజిల్ పై 20 పైసలు చొప్పున ధరలు తగ్గాయి. దేశంలో ఏడాది కాలం నుండి ముడిచమురు ధరలు తీవ్రంగా ఉన్నాయి. ఆ తర్వాత లీటర్ పెట్రోల్ పై 21.58 రూపాయలు..డీజిల్ పై 19.18 రూపాయలు పెంచాయి. ఇక ప్రస్తుతం హైదరాబాదులో లీటర్‌ పెట్రోల్‌ 94.61రూపాయలు ఉండగా, డీజిల్ ధ‌ర‌ 88.67రూపాయలుగా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర 97.24రూపాయలుగా ఉండ‌గా, డీజిల్‌ 90.76రూపాయలుగా ఉంది.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 90.78 రూపాయలు ఉండగా డీజిల్‌ 81.10 రూపాయలు త‌గ్గాయి.మరోవైపు ముంబైలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ 97.19 రూపాయలు ఉండగా డీజిల్ ధ‌ర‌‌ 88.20 రూపాయలు గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement