Friday, April 26, 2024

నారాయణ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీ కేసులో A-9 గా ఉన్న మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల తరపున అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి పిటిషన్ వేశారు. మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో నారాయణ పాత్రపై పోలీసుల వద్ద ఉన్న ఆధారాలను కోర్టుకు నివేదించారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నారాయణను చిత్తూరు పోలీసులు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న విష‌యం విధిత‌మే. అయితే ఈనెల‌ 11న చిత్తూరులోని స్థానిక కోర్టు నారాయణకు బెయిల్ మంజూరు చేసింది. నారాయణ బెయిల్ రద్దు చేయాల‌ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement