Friday, April 19, 2024

అభినందనలు పెప్సీ.. ఐ లవ్ యూ అంటోన్న స్టార్ హీరో యశ్

కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు కన్నడ హీరో యశ్.. దాంతో పలు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. కాగా తాజాగా ఆయన పెప్సీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు . అభినందనలు పెప్సీ.. ఐ లవ్‌ యూ.. అంటూ పెప్సీ డ్రింక్ తాగుతున్న 8 సెకన్ల వీడియోను యశ్‌ ట్విటర్‌లో షేర్ చేశాడు. స్టైలిష్ జీన్స్-టీషర్ట్‌ కాంబోలో యశ్‌ పెప్సీ తాగుతున్న వీడియో ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ కమర్షియల్‌ యాడ్‌ ఫుల్ వీడియోను త్వరలోనే లాంఛ్ చేయనుంది పెప్సీ. దాంతో యశ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement