Tuesday, April 16, 2024

ప్ర‌జా స‌మ‌స్య‌లు.. అప్ప‌టిక‌ప్పుడే ప‌రిష్కారం.. మంత్రి పేర్ని నాని..

రాష్ట్రంలో అందరికీ ఉపాధి, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఆవాసం అందుబాటులో ఉండాల‌ని, పంచాయతీ ప్రతినిధుల సామర్థ్యం పెంపుతోపాటు ప్రణాళికా వికేంద్రీకరణపై దృష్టి సారించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సాహేసోపేత నిర్ణయాలు తీసుకొంటున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను నేరుగా ఆయన కలుసుకున్నారు. వాహనం ఎక్కిన తర్వాత ఆయన జియో జూమ్ యాప్ ద్వారా కార్యాలయంలో బిగ్ స్క్రీన్ మీద అందరికి కనబడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకొని, ప‌లు సమస్యలకు మంత్రి అక్కడికక్కడే పరిష్క‌రించారు.

తొలుత మచిలీపట్నం మండలం గుండుపాలెం గ్రామానికి చెందిన మొవ్వ వెంకట వరప్రసాద్, తూమాటి భాస్కరరావు, తూమాటి శ్రీనివాసరావు, తిరుమలశెట్టి ఏడుకొండలు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు మంత్రి పేర్ని నానిను కలిశారు. తమ గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల పురాతనమైందని, ఆ ప్రాంతం బాగా పల్లమై పోయిందని, వర్షం నీరు మొత్తం అక్కడే నిలువ ఉంటుందని, శిధిలావస్థకు చేరిన పాఠశాల స్థానంలో నూతన నిర్మాణ పనులుచేపట్టాలని, గ్రామంలో వివిధ అంతర్గత రోడ్లను సిసి రోడ్లుగా రూపొందించాల‌ని , బాలానగర్ , పల్లెపాలెం పలుచోట్ల విద్యుత్ స్థంబాలు, కాలువలో దుస్తులు ఉతుక్కొనేందుకు మెట్ల నిర్మాణ విషయమై మంత్రి ముందుకు తీసుకువచ్చారు. ఈ స‌మ‌స్య‌ల‌పై మంత్రి స్పందించి పంచాయతీరాజ్ డి ఇ ,మచిలీపట్నం ఎం పి డి ఓ జి. సూర్యనారాయణ, విద్యుత్ ఈ డి, ఏ ఇ లకు ఫోన్ చేసి గుండుపాలెం గ్రామంకు వెళ్లి అక్కడ ఆయా పనులను పరిశీలించి అంచనాలు సిద్ధం చేయాలనీ ఆదేశించారు.

మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన పుప్పాల రాజ్యలక్ష్మి.. మంత్రికి తన సమస్యను జూమ్ ద్వారా తెలిపింది. నాలుగేళ్ల క్రితం ఆర్ధిక ఇబ్బందులతో సరైన జరుగుబాటు లేకపోవడం వ‌ల్ల పొలం అమ్మిన డబ్బులు 9 లక్షల రూపాయలను పోతేపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే జొన్నల సత్యనారాయణ ( సత్యం ) అనే వ్యక్తికి ఇచ్చానని, ఇప్పటికీ అసలు కానీ, వడ్డీ కానీ ఇవ్వడం లేదని వాపోయింది. స్థానిక వలందపాలెం మౌనీకాగ్రీన్ సిటీకి చెందిన వర్కింగ్ కమిటీ సభ్యులు మంత్రితో జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు.ఈ నెల 27 వ తేదీన వనసమారాధన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. స్పందించిన మంత్రి పేర్ని నాని వారితో మాట్లాడుతూ, తాను ఆరోజు అందుబాటులో ఉండనని హైదరాబాద్ వెళుతున్నట్లు చెప్పారు. కనుక మీరు మేయర్,డిప్యూటీ మేయర్లను, స్థానిక కార్పొరేటర్లనుఆహ్వానించాల్సిదిగా వారికి సూచించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement