Thursday, March 28, 2024

భారీగా క్షీణించిన పేటీఎం షేర్లు..

ఈ మధ్య కాలంలో.. పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయిన ఫిన్‌టెక్‌ కంపెనీగా పేటీఎం నిలిచింది. స్టాక్‌ మార్కెట్‌లో పేటీఎం షేర్ల ధరలు భారీగా క్షీణించాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గో త్రైమాసిక ఫలితాలతో పాటు బ్యాలెన్స్‌ షీట్స్‌ చాలా వీక్‌గా ఉన్నాయి. జనవరి-ఫిబ్రవరి-మార్చి కాలానికి సంబంధించి పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ రూ.763 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది.

నాల్గో త్రైమాసికంలో నష్టాలు..

శుక్రవారమే నాల్గో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను పేటీఎం సంస్థ వెల్లడించింది. గతేడాది నాల్గో త్రైమాసికంలో రూ.441.8 కోట్ల నికర నష్టాన్ని మూటగట్టుకుంది. ఇదే ఆర్థిక సంవత్సరంలో అంతకుముందు మూడో త్రైమాసికంలో రూ.778.5 కోట్ల నష్టాన్ని చవిచూసింది. నాల్గో త్రైమాసికంలోనూ ఇదే తరహా నష్టాలను మూటగట్టుకుంది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు సంస్థ చేసిన ఏ ప్రయత్నం కూడా ఫలించలేదనే చెప్పుకోవాలి. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీ నష్టాలనే కంపెనీ మూటగట్టుకుంది. పేటీఎం షేర్‌ ధర శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌లో రూ.572 వద్ద ట్రేడ్‌ అవుతున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. రూ.2,396.4 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఇది 41 శాతం అధికమని తెలిపింది. 2020-21లో రూ.1,701 కోట్ల నికర నష్టాలను కంపెనీ మూటగట్టుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో.. రెవెన్యూ పరంగా గతేడాదితో పోలిస్తే.. 65 శాతం మేర పెరిగింది. గతేడాది రూ.5264.3 కోట్ల లాభాలు వస్తే.. అంతకుముందు ఏడాది రూ.3,186.8 కోట్లు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement