Friday, April 19, 2024

భారత్‌లోనే అతిపెద్ద ఐపీవో… రూ.16,600 కోట్లతో పేటీఎం ఐపీవో

పేటీఎం తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు భారత్‌లోనే అతిపెద్ద ఐపీవో దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇనిషియల్​ పబ్లిక్ ఆఫరింగ్​ (ఐపీవో) ద్వారా రూ.16,600 కోట్ల పెట్టుబడులు ఆహ్వానించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. రూ.8,300 కోట్ల షేర్లను మార్కెట్​లో పెట్టడంతో పాటు కొత్తగా రూ.8,300 విలువైన తాజా షేర్లను పేటీఎం ఇష్యూ చేయనుంది. ఇలా మొత్తం రూ.16,600 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకునేందుకు ఐపీవో బాటపట్టింది. ఈ నెల 12న జరిగిన వన్​ 97 కమ్యూనికేషన్స్ సమావేశంలో షేర్​హోల్డర్లు ఐపీవోకు అంగీకరించారు. ఈ మేరకు తమ షేర్లను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని సెబీకి పేటీఎం దరఖాస్తు పెట్టుకుంది.

జేపీ మోర్గాన్ చేస్​, మోర్గాన్ స్టాన్లీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్​, గోల్డ్​మన్​ సచ్స్​, యాక్సిక్ క్యాపిటల్​, సిటీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ పేటీఎం ఐపీవోకు బుకింగ్ రన్నింగ్​ మేనేజర్స్​గా ఉండనున్నాయి. వన్​ 97 కమ్యూనికేషన్స్​ సొంతం చేసుకున్న పేటీఎంలో బెర్క్​షైర్ హాత్​వే, చైనాకు చెందిన యాంట్ గ్రూప్​, జపాన్ సాఫ్ట్​బ్యాంక్​ కంపెనీల పెట్టుబడులు కూడా ఉన్నాయి. ప్రి ఐపీవోల భాగంగా ఆలిబాబ్​.కామ్ కూడా 7.2శాతం షేర్లు దక్కించుకోనుంది. కాగా మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి వన్ 97 కమ్యూనికేషన్స్ సంస్థ రూ.1696 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఏడాది పేటీఎం రూ.2,420 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

ఈ వార్త కూడా చదవండి: ట్విట్టర్‌లో ఇకపై డిస్‌లైక్ బటన్

Advertisement

తాజా వార్తలు

Advertisement