Thursday, April 25, 2024

వకీల్ సాబ్ ఫ్యాన్స్ హంగామా

ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్గే వేరు. పవన్ సినిమాలు విడుద‌ల అవుతుండంటే చాలా ఇక ఫ్యాన్స్ చేసే హంగామా అంతాఇంతా కాదు. చాలా కాలం త‌ర్వాత పవర్ స్టార్ న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు.

పవన్ కల్యాణ్ లాయర్ పాత్రలో న‌టిస్తున్న తాజా మూవీ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ నిన్న విడుద‌లైన సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు చేసిన హంగామా, జ‌రుపుకున్న వేడుక‌ల‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

విశాఖప‌ట్నంలోని ఓ థియేట‌ర్‌లో ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా అభిమానులు ఎగ‌బ‌డుతూ థియేట‌ర్‌లోకి వెళ్లారు. ఈ క్ర‌మంలో కొంద‌రు కింద‌ప‌డిపోయారు. విశాఖ‌లోని మ‌రో ప్రాంతంలో 108 కొబ్బ‌రి కాయ‌లు కొట్టారు.  పాల‌కొల్లులో అభిమానులంతా ఒక్క చోట చేరి హ‌డావుడి చేశారు. థియేట‌ర్ల‌లో ట్రైల‌ర్ విడుద‌లైన స‌మ‌యంలో ప్రేక్ష‌కులంతా నిల‌బ‌డి డ్యాన్సులు చేస్తూ, కాగితాలు ఎగ‌రేస్తూ హంగామా చేశారు. ట్రైరల్ విడుదల అయితేనే ఇంతా చేస్తే.. ఇక, సినిమా రిలీజ్ కు ఎంత చేస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement