Thursday, May 6, 2021

వకీల్ సాబ్ రచ్చ.. కానిస్టేబుల్ పై పవన్ ఫ్యాన్ దాడి

దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన సమయంలో అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ సమయంలో బెనిఫిట్ షో ఆలస్యం అవ్వడంతో కొన్ని ప్రాంతాల్లో పవన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. కొన్ని చోట్ల థియేటర్స్ పైన దాడికి పాల్పడ్డారు. కుర్చీలు , గేట్లు విరగ్గొట్టారు. థియేటర్స్ పై రాళ్లవర్షం కురిపించారు.

తాజాగా అనంతపురం జిల్లాలోని నార్పలలో ఓ కానిస్టేబుల్ పై పవన్ కల్యాణ్‌ అభిమాని కత్తితో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నార్పలలోని శ్రీనివాస డీలక్స్ థియేటర్లో వకీల్ సాబ్ సినిమా సెకండ్ షోలో పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ నెలకొంది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు పరస్పరం దాడి చేసుకుంటుండగా థియేటర్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణను ను అదుపు చేయడానికి వెళ్లిన గౌస్ అనే కానిస్టేబుల్ పై పవన్ అభిమాని కత్తితో దాడి చేసాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. దీంతో  కానిస్టేబుల్ ను స్థానిక  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News