Thursday, April 18, 2024

పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ నుంచి ప్రోమో సాంగ్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాలో రానా మరో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా..  రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ అలరించనుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్, టైటిల్ సాంగ్‌కు అనూహ్యమైన రెస్పాన్ వచ్చింది. దసరా పండగ సందర్భంగా, కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు. “అంత ఇష్టమేందయ్యా .. అంత ఇష్టమేందయ్యా .. నీకు .. నా మీనా” అంటూ ఈ పాట సాగుతోంది. తమన్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, చిత్ర ఆలపించారు. పవన్ కల్యాణ్ – నిత్యామీనన్ లపై ఈ పాటను చిత్రీకరించారు. పూర్తి పాటను రేపు ఉదయం 10:09 నిమిషాలకు వదలనున్నట్టు చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement