Friday, April 26, 2024

8వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు..

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. నేడు (ఆదివారం) అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ సిబ్బంది వల్ల గానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల అలయ పవిత్రతకు ఎలాంటి లోపాలు రానీయకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో బాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడవీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

ఆగస్టు 8 న పవిత్రాల ప్రతిష్ట, 9న పవిత్ర సమర్పణ, 10 న పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. పవిత్రోత్సాల్లో నేడు అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా 9 వ తేదిన అష్టదళ పాదపద్మారాధనతో పాటు 8 నుంచి 10 వ తేది వరకు కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement