Friday, March 29, 2024

హాకీలో పతకం యువతకు స్పూర్తిదాయకం: పవన్

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన టీమిండియాకు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పురుషుల హీకీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ”నాలుగు దశాబ్దాల తరవాత మన హాకీ క్రీడాకారుల బృందం ఒలింపిక్స్ లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని” అన్నారు. మన జాతీయ క్రీడ హాకీలో ఒలింపిక్స్ పతకం గెలుచుకోవాలని క్రీడాభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. చిరకాల స్వప్నం నెరవేర్చిన ఒలంపిక్స్ క్రీడాకారులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో మన హాకీ జట్టు కాంస్యం గెలుచుకొని క్రీడాభిమానుల కలను నెరవేర్చింది”అని పవన్ అన్నారు. మహిళల హాకీ జట్టు సైతం విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ కల్యాణ్ అన్నారు.

కాంస్యం కోసం జరిగిన పోటీలో బలమైన ప్రత్యర్థి ఉన్నా ఆత్మస్థైర్యంతో పోరాడి గెలిచారు. ఈ స్ఫూర్తి ప్రశంసనీయమైనది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఒలింపిక్స్ పతకంతో హాకీ క్రీడకు మన దేశంలో పునర్వైభవం వస్తుంది. టోక్యో ఒలింపిక్స్ లో మన క్రీడాకారుల పోరాటపటిమ యువతలో ఉత్సాహాన్ని కలిగించడమే కాకుండా క్రీడలపై ఆసక్తి పెంచేలా చేస్తుంది. వారు సాధిస్తున్న పతకాలు ఆశాజనకంగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : సింధునే బ్రాండ్ అంబాసిడ‌ర్ చేయాలి: రాజాసింగ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement