Friday, March 29, 2024

దేశభక్తి గల సైనికులు కావాలే.. ఉక్రెయిన్‌లో కార్యకలాపాలకు రష్యా ప్రణాళిక

ఉక్రెయిన్‌లో పోరాటానికి రష్యా కొత్త సైన్యాన్ని సమీకరిస్తోంది. స్పెషల్‌ మిలటరీ ఆపరేషన్‌ పేరుతో యువతను ఆర్మీ సేవలకు ఆకర్షిస్తోంది. కాంట్రాక్టు ప్రాతిపదికన జవాన్ల నియామకాలకు తెరలేపింది. మొబైల్‌ రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. దేశభక్తితో ఆలోచించే సైనికులు కావలెనంటూ ప్రకటన చేసింది. వాలంటీర్లను ఆకర్షించడానికి మొబైల్‌ రిక్రూటింగ్‌ ట్రక్కులను ఉపయోగిస్తోంది. ప్రోత్సాహకంగా నెలకు దాదాపు 3,000 డాలర్లు ఇస్తామని పేర్కొంది. ఒక ప్రత్యేక విభాగం అటువంటి ట్రక్కును దక్షిణ రష్యాలోని రోస్టోవ్‌ నగరం సెంట్రల్‌ పార్క్‌లో ఉంచింది.

నల్లని ముసుగులు ధరించిన సైనికులు తుపాకీలు చేతబట్టి బ్రోచర్లు పంచుతూ కనిపించారు. 18-60 సంవత్సరాల వయసు, కనీసం హైస్కూల్‌ విద్యను కలిగి ఉన్నవారు అర్హులని రోస్టోవ్‌ ట్రక్‌కి ఇన్‌ఛార్జ్‌ అధికారి తెలిపారు. ”ప్రత్యేక సైనిక ఆపరేషన్‌లో పాల్గొనడానికి దేశభక్తి గల పౌరులు మూడు లేదా ఆరు నెలల పాటు ఒప్పందాలపై సంతకం చేయాలి” అని మేజర్‌ సెర్గీ అర్దాషెవ్‌ చెప్పారు. ఆరు నెలలుగా జరుగుతున్న యుద్ధంలో రష్యా లేదా ఉక్రెయిన్‌ తమ సైనిక నష్టాలను బ#హర్గతం చేయలేదు. పాశ్చాత్య గూఢచార సంస్థలు రెండు వైపులా పదివేల మంది మరణించి ఉంటారని అంచనా వేస్తున్నాయి. మాస్కో మార్చి 25 నుండి అధికారిక మరణాల సంఖ్యను నవీకరించలేదు. అప్పటి వరకు వెల్లడించిన వివరాల ప్రకారం 1,351 మంది రష్యన్‌ సైనికులు మరణించారు. 3,825 మంది గాయపడ్డారు.

ఒక సంభావ్య నియామకం సంగీతకారుడు విక్టర్‌ యాకునిన్‌ సైన్యంలో చేరేందుకు ముందుకొచ్చాడు. నేను వైమానిక దళాలలో సేవ చేయడానికి ఇష్టపడతాను. నా తల్లిదండ్రులు మాతృభూమిని ప్రేమించటానికి, రష్యన్‌ ప్రపంచాన్ని రక్షించడానికి చిన్నప్పటి నుండి నన్ను పెంచారని అతను చెప్పుకొచ్చాడు. ట్రక్‌ లోపల, యాకునిన్‌ అర్దాషెవ్‌తో కూర్చున్నాడు. తదుపరి దశ మానసిక పరీక్ష అని, అతను పాస్‌ అయితే, వేగం, బలం ,ఓర్పునకు సంబంధించిన శారీరక పరీక్ష నిర్వహిస్తారు. అన్నీ సరిగ్గా పాసైతే యకునిన్‌ సైనిక విభాగంలోకి చేరుకుంటాడని మేజర్‌ సెర్గీ అర్దాషెవ్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement