Thursday, February 2, 2023

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప‌ఠాన్.. వ‌సూళ్ల‌తో దూసుకుపోతోన్న చిత్రం

అమెజాన్ ప్రైమ్ వీడియో ప‌ఠాన్ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ని ద‌క్కించుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ న‌టులు షారుక్ ఖాన్ .. దీపికా పదుకొనే న‌టించారు. జాన్‌ అబ్రహాం నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. సల్మాన్‌ ఖాన్ అతిథి పాత్రలో మెరిశారు. టాప్ ప్రొడక్షన్‌ హౌజ్‌ యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. కొన్ని సెంటర్లలో మిక్స్‌డ్‌ టాక్‌తో, మరికొన్ని సెంటర్లలో మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది పఠాన్‌.స్టార్‌ డైరెక్టర్‌ సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెర‌కెక్కింది ఈ చిత్రం.స్పై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన పఠాన్‌ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. పఠాన్‌ టాక్‌తో సంబంధం లేకుండా ఫస్ట్‌ వీకెండ్‌లో మంచి వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement