Thursday, April 18, 2024

వెయ్యి కోట్ల క్ల‌బ్ లో షారూఖ్ ఖాన్ ప‌ఠాన్

చాలా కాలం నుండి సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న బాలీవుడ్ కి ఊపిరిలు పోసింది షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం మరో కీలక పాత్రలో నటించారు. జనవరి 25వ తేదీన అంటే క్రిందటి నెల గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అంతేకాక గతంలో ఉన్న అనేక రికార్డులను సైతం బద్దలు కొడుతోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 18 వ రోజు అంటే శనివారం నాడు ఈ సినిమా రాబట్టిన వసూళ్లతో ఏకంగా 1000 కోట్ల మార్క్ బద్దలు కొట్టింది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ సినిమా ఒక భారీ బడ్జెట్ సినిమా కాగా సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక బాలీవుడ్ ఫిలిం క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ రోహిత్ జైస్వాల్ చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని రోహిత్ జైస్వాల్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు అది కూడా చైనాలో విడుద‌ల కాకుండానే 1,000 కోట్ల మార్క్ అందుకోవడం అనేది ఒక రిమార్కబుల్ జర్నీ అని పేర్కొన్నారు. ఈ పఠాన్ ఇండియాలో తెరకెక్కించిన ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అంటూ ఆయన కామెంట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement