Thursday, April 25, 2024

ప‌ఠాన్ కి నిర‌స‌న సెగ.. ఇండోర్ లో సినిమా నిలిపివేత‌

ప‌ఠాన్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్. కాగా ఇప్పటికే ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని పలు హిందూ సంఘాలు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సినిమా విడుదలవనున్న థియేటర్‌పై అసోంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని సప్నా సంగీత థియేటర్‌ ఎదుట ఓ హిందూ సంస్థ చిత్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. ఈ క్రమంలోనే ఉదయం 9 గంటల షోను రద్దు చేశారు. థియేటర్‌ బయట విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు హనుమాన్‌ చాలీసా పటించారు. సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు కర్రలతో మరో వైపు ముంబయిలోని పలు థియేటర్ల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మరో వైపు గైటీ గెలాక్సీ థియేటర్‌ వద్ద అభిమానులు సంబురాలు నిర్వహించారు. షారుఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రంలో బాద్‌షాకు జోడీగా దీపికా పదుకొణె నటించింది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా.. మరో ప్రధాన ప్రాత్రలో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం నటించాడు. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించగా.. ప్రముఖ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement