Wednesday, March 27, 2024

పిల్లికి చ‌నుబాలిచ్చిన ప్యాసెంజ‌ర్‌.. బిత్త‌ర‌పోయిన విమాన ప్ర‌యాణికులు..

న్యూయార్క్: మనకు వింతగా కనిపించొచ్చుగానీ పెంపుడు జంతువులను సొంత పిల్లల్లా చూసుకోవడం పాశ్చాత్యుల్లో ఎక్కువ. అమెరికాకు చెందిన ఓ జంతు ప్రేమికురాలిని చూస్తే అది నిజమేననిపిస్తుంది. అమెరికాలోని సిరాక్యూస్ నుంచి అట్లాంటాకు డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో బయలుదేరిన కొద్దిసేపటి తరువాత ఓ ప్రయాణికురాలు తన వెంట తీసుకువెడుతున్న పెంపుడు పిల్లికి చనుబాలు పట్టడం మొదలుపెట్టింది. ఆ అనూహ్య దృశ్యాన్ని చూసిన తోటి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

పిల్లిని కేజ్ లో పెట్టుకోవాలని ఫ్లైట్ అటెండెంట్ కోరినప్పటికీ ఆమె వినలేదు. ఇదే విషయాన్ని ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్ విభాగానికి సమాచారం అందించారు. దీంతో ల్యాండింగ్ అప్ర‌మత్తమైన రెడ్ కోట్ టీమ్ విమానం ల్యాండిగ్ సమయానికి రన్వే వద్దకు చేరుకుంది. బొచ్చులేని ఆ పిల్లిని ఓ టవల్ లో చుట్టి చనుబాలు పట్టడం వల్ల చిన్నారనే అనుకున్నామని, కానీ ఆ మార్జాలం మ్యావ్ మని అవరడంతో విషయం బయపడిందని, అయినా ఏమీ పట్టని ప్రయాణికురాలు పాలు పడుతూనే ఉందని సిబ్బంది చెప్పుకొచ్చారు. విశేషం ఏమిటంటే, అందర్నీ బెంబేలెత్తించిన ఆ ప్రయాణికురాలు విమానం దిగిన తరువాత విమానాశ్రయ సిబ్బంది మెచ్చుకోలుగా అభినందించడం.

Advertisement

తాజా వార్తలు

Advertisement