Sunday, February 5, 2023

రైలులో ప్రయాణికుడు మృతి..

రామేశ్వరం నుంచి ఒకా వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైల్ లో అనారోగ్యంతో ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. నంద్యాల జిల్లా డోన్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రామేశ్వరం నుంచి ఒకా వెళ్తున్న రైలులో మధురై నుంచి రాజ్ కోటికి ప్రయాణిస్తున్న మనోహర్ లాల్ (60) గుత్తి సమీపంలో అనారోగ్యంకి గురయ్యారు. డోన్ రైల్వే స్టేషన్ కు చేరుకోగానే మనోహర్ మృతి చెందినట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement