Monday, April 15, 2024

పార్థా చటర్జీ మంత్రి పదవి ఊడింది.. ప్రకటించిన పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం

టీచర్ల నియామక కుంభకోణంలో అరెస్ట్‌ అయిన పార్థా చటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించినట్లు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. పార్థా చటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించే విషయమై రాష్ట్ర కేబినేట్‌లో ఎటువంటి చర్చ జరుగలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీచర్ల కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు పార్థా చటర్జీని ఇటీవల అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. కుంభకోణంలో అరెస్ట్‌ అయిన పార్థా చటర్జీని పార్టీ నుంచి బహిష్కరాంచాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రదానకార్యదర్శి కునాల్‌ ఘోష్‌ అన్నారు. పార్థా చటర్జీ పశ్చిమ బెంగాల్‌ సీఎం తృణమూల్‌ కాంగ్రేస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. అయితే ఆయనను దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్‌ చేయడానికి ముందు పలు దఫాలు పార్థా చటర్జీ చేసిన ఫోన్‌కాల్స్‌ను సీఎం మమతా బెనర్జీ రిసీవ్‌ చేసుకోలేదని వార్తలొచ్చాయి.

ఆ డబ్బు ఎవరిది: మిథున్‌ చక్రవర్తి

పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థా చటర్జీ అనుచరురాలు అర్పిత ముఖర్జీ ఇళ్లలో రూ 50 కోట్లకు పైగా డబ్బుల కట్టలను ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్వాధీనం చేసుకుంది. విద్యాశాఖ మంత్రి అయిన ఆయనను టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ కుంభకోణంలో ఈడీ అరెస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో బిజెపి నేత మిథున్‌ చక్రవర్తి దీనిపై స్పందించారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నవారి పేర్లను బయటపెట్టాలని కోరారు. ఈడీ స్వాధీనం చేసుకున్న రూ 50 కోట్లకు పైగా నగదు పార్థా చటర్జీ దేనని తాను నమ్మడం లేదన్నారు. ఎవరికో చెందిన డ బ్బును తన కస్టడీలో ఆయన ఉంచారని అన్నారు. ఆ డబ్బుల అసలు యజమానుల పేర్లను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. జైలులో బాధపడటం ఎందుకు? ఆ డబ్బు అసలు యజమానుల పేర్లు చెప్పు అని పార్థా చటర్జీకి మిథున్‌ చక్రవర్తి సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement