Thursday, November 28, 2024

Delhi | 25 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు !

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20 వరకు సమావేశాలు కొనసాగించే వీలుంది. కాగా, ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో పాటు పలు ముఖ్యమైన బిల్లులపై సవివరంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.

వన్ నేషన్-వన్ ఎలక్షన్ నివేదికను కేబినెట్ ఆమోదించిన తర్వాత శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బిల్లు ఎలా గట్టెక్కిసారనే దానిపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఏర్పాటైన జేపీసీ తన నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సమర్పించే అవకాశం ఉన్నందున.. దీనిపై కూడా ఉత్కంఠ రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందుతుందని హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పారు.

కాగా, భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, నవంబర్ 26న పాత పార్లమెంట్ హౌస్‌లోని సెంట్రల్ హాల్‌లో పార్లమెంటు ఉభయ సభలు జరగనున్నాయి. ఈ స్థలంలోనే 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని ఆమోదించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement