Friday, April 19, 2024

పుతిన్‌కు పార్కిన్సన్స్‌?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మరోసారి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్‌ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. క్రమంగా అతని ఆరోగ్యం దిగజారిందని, యుద్ధ ఒత్తిడి కారణంగా పుతిన్‌ ఆరోగ్యం క్షీణిస్తోందని అధ్యక్ష కార్యాలయ అధికారులు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నట్లు కథనాలు వెలవడ్డాయి. పుతిన్‌కు ప్రాణాంతక వ్యాధి ఉందని, దాని కారణంగా అతని జీర్ణవ్యవస్థ కూడా దెబ్బతిందని కూడా పేర్కొన్నాయి.

పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ దియాజ్‌- కానెల్‌ వై బెర్మెడెజ్‌తో భేటీ అయిన సందర్భంగా పుతిన్‌ చాలా అసౌకర్యంగా కూర్చున్నట్లు, ఫుతిన్‌ చేయి గులాబీ రంగులో ఉన్నట్లు ఫొటోలు ప్రచురితమయ్యాయి. అలాగే పుతిన్‌ పాదాలు వణుకుతున్నట్లు గుర్తించినట్లు ది మిర్రర్‌ కథనం పేర్కొంది. క్యూబా దేశాధినేతతో సమావేశమైనప్పుడు ఫుతిన్‌ ముఖం పాలిపోయినట్లు, అతని శరీరం ఉబ్బినట్లు కనిపించిందని టెలిగ్రామ్‌ చానల్‌ తన కథనంలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement