Thursday, April 25, 2024

ప‌రేషాన్ టీజ‌ర్ రిలీజ్

‘మసూద’ సినిమాతో విజయం అందుకున్న హీరో తిరువీర్‌ ఇప్పుడు రూపక్‌ రోనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహించిన ‘పరేషాన్‌’ అనే ఎంటర్‌-టైనర్‌తో వస్తున్నాడు. సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టీ-జర్‌ను విడుదల చేసి ప్రమో షన్స్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు శైలేష్‌ కొలను, వినోద్‌, శాంటో, ప్రవీణ్‌, మల్లిక్‌, ఉదయ్‌తో పాటు- చిత్ర బృందం పాల్గొన్నారు.
ఈ చిత్రం తెలంగాణలోని ఒక పల్లెటూరి నేప థ్యంలో సాగుతుంది. అక్కడ స్నేహితుల గ్యాంగ్‌, వారి జీవితాల్లోని అస్తవ్యస్తమైన పరిస్థితులు, సిల్లీ సంఘట నలు.. చిక్కులు తెచ్చిపెడతాయి. తిరువీర్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పాత్రలో పావని కరణం కనిపించింది. వారు ఎదుర్కొ నే సమస్యలు వినోదం పంచుతాయి. దర్శకుడు రూపక్‌ రోనాల్డ్‌సన్‌ పరేషాన్‌ ని యూనిక్‌ గా ట్రీ-ట్‌ చేశారు.
ఈ సందర్భంగా శైలేష్‌ కొలను మాట్లాడుతూ.. పావని చాలా అద్భుతమైన నటి. తిరువీర్‌ ఏ పాత్రని చేసినా దాన్ని నమ్మించగలిగే నటు-డు. పరేషాన్‌ టీ-ం అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. అన్నారు.


తీరు వీర్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా సహ జంగా వుంటు-ంది. కోవిడ్‌ లో మొదలుపెట్టిన సినిమా ఇది. ఈ టీ-ం అందరికీ మంచి సినిమా చేయాలనే పిచ్చి వుంది. లాస్ట్‌ బాల్‌ స్టేజ్‌ లో వుంది. సిక్స్‌ కోడతామనే నమ్మకం వుంది అన్నారు.
పావని మాట్లాడుతూ.. పరేషాన్‌ తో లీడ్‌ క్యారెక్టర్‌ లో పరిచయం అవుతున్నందుకు ఆనందం గా వుంది. అన్నారు.
చిత్ర దర్శకుడు రూపక్‌ మాట్లాడుతూ.. ఒక ప్రాజెక్ట్‌ చేసినపుడు పేరు కోసం డబ్బు కోసం చేస్తారు. కానీ సినిమా కోసం చేసిన సినిమా పరేషాన్‌. అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. టీ-జర్‌ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది జనం సినిమా. తెలిపారు.
ప్రవీణ్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా ఎవరు తీసుకుంటో తెలీదు కానీ వాళ్ళు ఒక జాక్‌ పాట్‌ కొట్టినట్లే. చెప్పారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement