Sunday, March 24, 2024

ప‌రారీ ట్రైల‌ర్ రిలీజ్

యోగేశ్వర్‌, అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ. ఈ చిత్రం నుండి విడుదల అయిన టీ-జర్‌ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం మార్చి 30న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు- చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజకీయ నేతలు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, సీనియర్‌ నటు-లు సుమన్‌, ప్రసన్న కుమార్‌ లు థియేట్రికల్‌ -టైలర్‌ ను విడుదల చేయగా, దర్శకులు చంద్ర మహేష్‌, నిర్మాత తుమ్మలపల్లి రామసత్య నారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్‌ లు థియేట్రికల్‌ ప్రోమో ను విడుదల చేశారు.నటి కవిత సాంగ్‌ ప్రోమో ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు హనుమంత రావు , గాలి అనిల్‌ కుమార్‌, రవతు కనకయ్య, పొన్నం ప్రభాకర్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులతో పాటు- చిత్ర యూనిట్‌ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఇదే వేదికపై చిత్ర హీరో యోగేశ్వర్‌ బర్త్‌ డే సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement