Sunday, October 13, 2024

Paralympics | భారత్ ఖాతాలో మరో పతకం..

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. నేడు (గురువారం) జూడో పురుషుల 60 కేజీల జే1 విభాగంలో కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. ఈ క్ర‌మంలో కపిల్ భారతదేశపు మొట్టమొదటి పారా జూడో పతక విజేతగా చరిత్ర సృష్టించాడు. కాంస్య పతక పోరులో బ్రెజిల్‌కు చెందిన ఎలియెల్టన్ డి ఒలివెరాపై 10-0 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఆ ఘనత సాధించాడు.

కాగా.. తాజా పతకంతో పారాలింపిక్స్ లో భార‌త్ పతకాల సంఖ్య 25కి చేరింది. అందులో.. ఐదు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement