Friday, October 4, 2024

TG | పారాలింపిక్ పతక విజేత దీప్తికి రూ.కోటీ.. చెక్ అంద‌జేసిన సీఎం !

పారాలింపిక్స్‌లో 400 మీటర్ల రేస్ లో కాంస్య పతకం సాధించిన దీప్తి జీవన్‌జీకి రూ.కోటి నగదు ప్రోత్సాహకం, ఆమె కోచ్ నాగపురి రమేష్‌కు రూ.10 లక్షలు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అందజేసింది. చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందజేశారు.

పారాలింపిక్స్‌లో 400 మీటర్ల రేసులో కాంస్య పతకం సాధించిన దీప్తి జీవన్‌జీకి రూ.కోటి నగదు బహుమతి, వరంగల్ లో 500 గజాల స్థలం, ఆమె కోచ్ కు రూ.10లక్షలు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు దీప్తి జీవన్‌జీ, కోచ్‌లకు చెక్కులను అందజేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి కీర్తి తెచ్చే క్రీడాకారులకు గతంలో లేనటువంటి ప్రోత్సాహకాలు అందజేస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

కాగా, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె.శివసేనారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement