Saturday, April 20, 2024

ఢిల్లీ హైకోర్టుకు గ్రామ వ‌లంటీర్లకు పేప‌ర్‌ అలవెన్స్ కేసు.. విచారణ బదిలీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు నెల నెల దినపత్రిక కొనుగోలు చేయడం కోసం రూ. 200 కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. వాలంటీర్లకు నెల నెలా రూ. 200 మంజూరు చేసి, తద్వారా కేవలం ‘సాక్;షి దినపత్రిక కొనుగోలు చేయించడాన్ని వ్యతిరేకిస్తూ ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

న్యాయ, పరిపాలన ప్రయోజనాల దృష్ట్యా విచారణను ఏపీ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీ హైకోర్టుకు విచారణను బదిలీ చేయడం వల్ల ఏపీ హైకోర్టుపై నమ్మకం పోతుందని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించగా.. అలాంటి అభిప్రాయానికి తావివ్వకుండా ఉత్తర్వులు ఇస్తామమన్న చీఫ్ జస్టిస్ తెలిపారు. ఇది 2 పత్రికల మధ్య వ్యవహారంగా కనిపించడం లేదని, రెండు పార్టీల మధ్య వ్యవహారంగా కనిపిస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజాధనాన్ని వాలంటీర్లకు బదిలీ చేసి ‘సాక్షి’ పత్రికను కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఉషోదయా సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement