Thursday, April 25, 2024

వచ్చే వారం పంత్‌ డిశ్చార్జ్‌?

పంత్‌ ఆరోగ్యంపై అభిమానులకు శుభవార్త అందింది. పంత్‌ ఈ వారంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవ్వనున్నట్లు బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. మోకాలికి జరిగిన సర్జరీ సక్సెస్‌ అయ్యిందని పంత్‌ త్వరగా కోలుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన ముంబయిలోని కోకిలెబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి వైద్యులతో బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది మార్చి నెలలో మరో సర్జరీ అవసరం కావొచ్చు. అది ఎప్పుడు నిర్వహించాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు.

”త్వరలోనే అతడు పూర్తిగా కోలుకుని మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నాం. పంత్‌ తిరిగి మైదానంలోకి రావడానికి కనీసం 8 నుంచి 9 నెలల సమయం పట్టొచ్చు. ప్రస్తుతం మా దృష్టంతా అతడి రికవరీపైనే ఉంది” అని బిసీసీఐ అధికారి తెలిపారు. గతేడాది డిసెంబర్‌ 30వ తేదీన ఢిల్లిd నుంచి రూర్కీ వెళుతుండగా పంత్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement