Saturday, April 20, 2024

సొంత పనులకు పంచాయతీ ట్రాక్టర్‌..!

  • విషయం బయటకు రావడంతో కుమ్మక్కైన కాంట్రాక్టర్‌, అధికారులు
  • మొక్కలకు నీరు పోయకుండా.. చెత్త సేకరణ చేయకుండా అధికార దుర్వినియోగం

స్వంత పనులకు సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీ ట్రాక్టర్‌ను యధేచ్ఛగా వాడుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారికంగా అద్దెకు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించేందుకు అధికారులు, కాంట్రాక్టర్‌లు కుమ్కక్కై నానా తిప్పలు పడ్డారు.

మోతె/ప్రభన్యూస్ : గ్రామాలలో ప్రజల ఆరోగ్య రక్షణతో పాటు- పారిశుద్ధంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మరోవైపు పచ్చదనం హరిత విప్లవం సాధించేందుకు నీటి ట్యాంకర్లు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం కల్పించిన వీటి సహకారంతో గ్రామాలు పురోభివృద్ధిలో వాటి పాత్ర కీలకంగా మారిందని చెప్పవచ్చు.. ప్రతి వీధిలో ప్రతి ఇంటికి ట్రాక్టర్లు తరలించి నగరాలు, పట్టణాలలో మాదిరిగా గ్రామాలలో సైతం చెత్త సేకరణ జరుగుతుంది. మరోవైపు మొక్కల సంరక్షణకు వాటర్‌ నీటి ట్యాంకులతో నీరు పోస్తూ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా మండల కేంద్రంలో అవి సొంత పనులకు ఉపయోగిస్తుండడం.. దీనికి గ్రామ పంచాయతీ అధికారిని సహకరించడం కొసమెరుపు. గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌, నీటి వాటర్‌ ట్యాంక్‌ ను అనధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే గ్రామాలలో చెత్త సహా మొక్కలకు నీరు పోయకుండా స్వయంగా సొంత పనులకు అనధికారికంగా ఎలా ఉపయోగిస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో ప్రభుత్వ కార్యకలాపాలకు ట్యాంకర్‌ను వినియోగించడంలో కీలకంగా ఉండాల్సిన గ్రామ పంచాయ‌తీ అధికారి స్వంత పనులకు ట్యాంకర్‌ను వాడటంపై, గ్రామ పంచాయతీ నుంచి అద్దెకు తీసుకున్నట్లు పత్రాలు సృష్టించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మూడు రోజులుగా ట్రాక్టర్‌, ట్యాంకర్‌ వినియోగిస్తుంటే ఇవాళ కొత్తగా అద్దెకు తీసుకున్నట్లు పత్రాలు వెలువడటం ఏమిటనే ప్రశ్న గ్రామస్తుల నుంచి వినిపిస్తోంది. చెత్త సేకరించకుండా మరోపక్క మొక్కలకు నీరు పోయకుండా సొంత పనులకు ఎలా అద్దెకిస్తారని బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ సెక్రెటరీ ఎలా పత్రాలు జారీ చేశారు.. దీనిపై ఉన్నతాధికారులు ఏ మేర చర్యలు తీసుకుంటారు వేసి చూడాల్సిందే.. ఈ విషయమై డీఎల్పీవో దృష్టికి తీసుకెళ్లగా సమాచారం మా దృష్టికి వచ్చింది. డిపివో దృష్టికి తీసుకెళ్లి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement