Thursday, March 28, 2024

పంచ‌తంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి.. ముహూర్తం ఖరార్

బ్ర‌హ్మానందం..స్వాతిరెడ్డి..దివ్య శ్రీపాద‌..శివాత్మిక‌..రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన‌పాత్ర‌లు పోషించిన చిత్రం పంచతంత్రం.. ఈ సినిమాను, ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ని ఫిక్స్ చేశారు మేక‌ర్స్. సృజన్ – అఖిలేశ్ నిర్మించిన ఈ సినిమాకి హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. ఈ నెల 7వ తేదీన ఈ ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నారు. స్పెషల్ గెస్టుగా ద‌ర్శ‌కుడు హరీశ్ శంకర్ రానున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో వైవిధ్యభరితమైన కథలను పట్టుకుని యువ దర్శక నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. బడ్జెట్ .. స్టార్ కాస్టింగ్ కంటే కూడా కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. కంటెంట్ లో విషయం ఉంటే ఆదరించడానికి ఆడియన్స్ ఎంతమాత్రం ఆలోచన చేయడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement