Sunday, December 8, 2024

AUS vs PAK | పాక్ కొత్త చరిత్ర.. ఆసిస్ పై ఘ‌న విజ‌యం !

ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (శుక్రవారం) జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ విజయం సాధించింది. ఆసీస్‌ గడ్డపై పాక్‌ ఏడేళ్ల తర్వాత తొలిసారి ఓ వన్డేలో విజయం సాధించింది. 2017 జనవరి 15న‌ పాక్‌ చివరిసారి ఆసీస్‌ను వారి సొంతగడ్డపై (మెల్‌బోర్న్‌) ఓ వన్డేలో ఓడించింది.

కాగా, నేటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లలో 163 ​​పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ స్టార్ పేసర్ హరీస్ రవూఫ్ (5/29) ఐదు వికెట్ల చెల‌రేగ‌డంతో.. ఆసీస్ పతనానికి దారితీసింది. షాహిన్ షా ఆఫ్రిది (3/26) మూడు వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహ్మద్ హస్నైన్ తలా ఒక వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య చేధన‌కు దిగిన పాక్… 26.3 ఓవర్లలో వికెట్ నష్టానికి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్ (71 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82), అబ్దుల్లా షఫీక్ (69 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

ఇక‌, మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమం అయ్యింది. దీంతో ఆదివారం పెర్త్ వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్‌ డిసైడర్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సిరీస్ వరించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement