Thursday, November 7, 2024

PAK vs ENG | మూడు శ‌త‌కాల‌తో హోరెత్తిన పాక్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే !

ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జ‌రుగుతున్న‌ టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ దంచి కొట్టింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించారు. దీంతో పాక్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది.

కాగా, ముల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 4 వికెట్లకు 328 పరుగులు చేసింది. ఇక‌, ఈరోజు రెండు రోజు ఆట ముగిసే సమయానికి 149 ఓవర్లలో 556 పరుగులు చేసింది.

ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(184 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), కెప్టెన్ షాన్ మసూద్ (177 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 151), సల్మాన్ అఘా (119 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104) శతకాలతో రాణించారు. సౌద్ షకీల్ (117 బంతుల్లో 8 ఫోర్లతో 82) తో హాఫ్ సెంచ‌రీ సాధించాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో జాక్ లీచ్ (3), గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే రెండేసి వికెట్లు సాధించారు. షోయబ్ బషీర్, క్రిస్ వోక్స్, జో రూట్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.

కాగా, రెండో రోజు త‌మ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 20 ఓవ‌ర్ల‌లో ఒక్క వికెట్ న‌ష్టానికి 96 ప‌రుగులు చేసింది. జాక్ క్రాలే (64 బంతుల్లో 11 ఫోర్లతో 64) ధనాధ‌న్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. మ‌రోవైపు జో రూట్ కూడా దూకుడుగా ఆడుతూ (54 బంతుల్లో 2 ఫోర్లతో 32) ప‌రుగులు చేశాడు. నసీమ్ షా ఒక్క వికెట్ తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement