Thursday, March 28, 2024

ఊబకాయంతో ఉంటే కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ

అధిక బరువు ఉన్నవారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా బారిన పడిన ఊబకాయులు ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తేల్చి చెప్పారు. బాడీ మాస్ ఇండెక్స్ (BMI)ను బట్టి కరోనా ప్రమాదాన్ని లెక్కగట్టారు శాస్త్రవేత్తలు. ఇలా బీఎంఐతో కరోనా ప్రమాదాన్ని అంచనా వేసిన మొదటి అధ్యయనం ఇదే కావడం విశేషం. ఈ అధ్యయనం ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న 6.9 మిలియన్ల మందిపై కొనసాగింది. కరోనా ఫస్ట్​వేవ్​లో ఆసుపత్రిలో చేరిన లేదా మరణించిన 20 వేల మంది రోగుల డేటాను సైతం అధ్యయనం కోసం సేకరించారు. చదరపు మీటరుకు 23 కిలోగ్రాముల కంటే ఎక్కువ బిఎమ్‌ఐ ఉన్నవారిలో కరోనా ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. BMIలో ఒక్కో యూనిట్ పెరుగుదలతో 5 శాతం అధికంగా ఆసుపత్రిలో చేరే ప్రమాదం పెరిగిందని, ప్రతి యూనిట్ పెరుగుదలకు ఐసియు ప్రవేశం 10 శాతం పెరిగిందని గుర్తించారు.

అయితే తక్కువ బరువు (18.5 కన్నా తక్కువ BMI)ఉన్న వారిలో కరోనా ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఊబకాయంతో బాధపడుతున్న 20 నుంచి 39 సంవత్సరాల వయస్సు గల యువత.. కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఆశ్చర్యకరంగా 60 సంవత్సరాల వయస్సు గల వారిలో ఈ ప్రమాదం తగ్గిందని పరిశోధకులు తెలిపారు. మరోవైపు, 80 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో కరోనా ప్రమాదంపై BMI పెరుగుదల చాలా తక్కువ ప్రభావాన్ని చూపిందని తేల్చి చెప్పారు. ఒక వ్యక్తి బరువును కిలోగ్రాముల్లో, ఎత్తును మీటర్లలో కొలిచి BMIని లెక్కగతారన్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement