Thursday, April 18, 2024

నాలుగు కోట్ల పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్

వాహన తుక్కు విధానం నేపథ్యంలో దేశంలో 15 ఏళ్లు పైబడిన పాత వాహనాల వివరాలను కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 4 కోట్ల 40 మిలియన్లు)పాతవాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని, ఈ వాహనాలు గ్రీన్ సెస్ పరిధిలోకి రానున్నాయని తెలిపింది. పాత వాహనాలు అత్యధికంగా కర్ణాటకలో 70 లక్షలకుపైగా ఉంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న పాత వాహనాలల వివరాలను రవాణా మంత్రిత్వశాఖ డిజిటలైజ్ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్,
తెలంగాణ, లక్షద్వీట్లలో పాత వాహనాలకు సంబంధించిన
రికార్డులు అందుబాటు లో లేవన తెలిపింది. పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధింపునకు సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించామని తెలిపింది. దేశంలో మొత్తం 4 కోట్ల పాత వాహనాలు ఉండగా.. అందులో 2 కోట్లకుపైగా వాహనాలు 20 ఏళ్లు పైబడినవి కావడం గమనార్హం. 15 సంవత్సరాలు పైబడిన వాహనాలను డొక్కు వాహనాల కింద పరిగణిస్తారు. ఈ వాహనాల కారణంగా కాలుష్యం ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీంతో వీటి వాడకాన్ని తగ్గించేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగానే వాహన తుక్కు విధానాన్ని ప్రకటించింది. అలాగే ఇలాంటి పాత వాహనాలపై గ్రీనర్ సెస్ విధించేందుకు కేంద్రం సమాయత్తమవు తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పింపినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

కాలుష్యానికి కారణమయ్యే ఈ వాహనాలన్నింటిపై గ్రీన్ సెస్ విధించాలని కేంద్రం యోచిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణే లక్ష్యంగా ఈ మేరకు అడుగులు వేస్తోంది. హైబ్రీడ్, విద్యుత్, సీఎజ్, ఇథనాల్, ఎల్పీజీ వంటి ఇంధనాలతో నడిచే వాహనాలకు పన్నుల నుంచి మినహాయింపు విషయాన్ని రవాణా మంత్రిత్వశాఖ పరిశీలిస్తోందని సమాచారం. కాగా !
‘న్ సెస్ కింద వసూలయ్యే ఆదాయంతో కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని కేంద్రం యోచిస్తోంది. పాత వాహనాలపై
‘న్ ట్యాక్స కు ఆమోదం లభించిందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖమంత్రి నితిన్ గడ్కరీజనవరిలోనే ప్రకటించారు. గ్రీన్ సెస్ పై సంప్రదింపుల కోసం రాష్ట్రాలకు పంపించామని ఆయన చెప్పారు. ఈ గ్రీన్సెస్రా ష్ట్రాలు అధికారికంగా గుర్తించాలన్నారు. కాగా ప్రస్తుతం
వేర్వేరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వేరు వేరు రేట్లతో గ్రీన్ సెస్ విదిస్తున్నాయి.

గ్రీన్ ట్యాక్స్ విధింపు
ప్రతిపాదన ఇది…

8 ఏళ్లుపైబడిన రవాణా వాహనాలకు సంబంధించి ఫిట్నెస్సర్టిఫికెట్ రెన్యూవల్ సమయం లో పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ ను విధించనున్నారు. రోడ్డు ట్యాక్స్ లో 10 నుంచి 25 శాతం విధించనున్నారు. ఇక వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్లు దాటిన తర్వాత రిజిస్ట్రేషన్ రెన్యూవల్ సమయంలో గ్రీన్‌ ట్యాక్స్ విధిస్తారు. సిటీ బస్సులు వంటి ప్రజా రవాణా వాహనాలపై తక్కువ గ్రీన్సెస్ విధిస్తారు. అధిక కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై 50
శాతం గ్రీన్‌ట్యాక్స్ ను విధించనున్నారు. ట్యాక్స్ విధింపులో వ్యత్యాసం ఉండనుంది. దృఢ హైబ్రీడ్, ఎలక్ట్రా నిక్ వాహనాలు, సీఎ్ప, ఇథనాల్, ఎల్పజీ వంటి ప్రత్యమ్నాయ ఇంధనాల వినియోగంతో పాటు వ్యవసాయంలో వినియోగించే ట్రాక్టర్లు, హార్వేస్టర్, టిల్లరు గ్రీన్ టాక్స్ నుంచి మినహాయిం చనున్నారు ‌ . గ్రీన్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రత్యేకం గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధితో కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. రాష్ట్రాలు ఉద్గార నియంత్రణ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఇదివరకే స్పష్టత ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement