Friday, April 19, 2024

Big Story | సౌరతుఫానుల వెల్లువ.. సూర్యుడిలో పెరిగిన విస్ఫోటనాలు

భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహాలకు ముప్పు ఏర్పడుతోంది. వాటి పనితీరును ప్రభావితం చేసి నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి మానవులు కారణం కాదు. సూర్యుడిలో రోజురోజుకు పెరుగుతున్న జ్వాలా విస్ఫోటనాలు, ఆ గ్రహంలోని అయస్కాంత క్షేత్రాల్లో రేగుతున్న అలజడులు భూగ్రహంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఆ పరిణామాలవల్ల సూర్యుడి నుంచి భూవాతావరణంలోకి లెక్కలేనన్ని టెరావాట్స్‌ శక్తి చొచ్చుకువస్తోంది. అందువల్ల భూ ఉపరితల వాతావరణం అనూహ్యంగా, అత్యధికంగా వేడెక్కిపోతోంది. ఈ విషయాన్ని స్పేస్‌వెదర్‌.కామ్‌ వెల్లడించింది. అదీగాక, ఈ పరిణామం భూ అయస్కాంత క్షేత్రాలను కల్లోల పరుస్తోంది.

- Advertisement -

దీనివల్ల విద్యుత్‌ సరఫరా సహా అనేక అంశాల్లో అంతరాయాలు సృష్టిస్తోంది. సూర్యుడిలో జ్వాలా విస్ఫోటనాలను కొరోనల్‌ మాస్‌ ఎజెక్షన్స్‌గా (సీఎంఈ) చెబుతారు. అంటే, సూర్యుడిలోని అయస్కాంత క్షేత్రాల్లో మండుతున్న ఉష్ణగోళాలు విస్ఫోటనం చెంది ప్లాస్మాను వెదజల్లడం. అత్యంత వేడితో కూడిన సీఎంఈ కణాలు, సౌరవాయువులు అంతరిక్షంలోని ఇతర గ్రహాల అయస్కాంత క్షేత్రాలను తాకుతూ ప్రయాణిస్తాయి. అలా భూ అయస్కాంత క్షేత్రాలపైనా ప్రభావం చూపిస్తున్నాయి. దీనివల్ల అయితే, భూ వాతావరణంపై పెద్ద ప్రభావం లేకపోయినప్పటికీ, భూగ్రహ దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహాలపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నాసాకు చెందిన శాస్త్రవేత్త మార్టిన్‌ వ్లిున్‌జక్‌ అభిప్రాయపడ్డారు.

గడచిన 21.5 సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే సూర్యుడి నుంచి వస్తున్న సీఎంఈ గాలుల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆయన చెబుతున్నారు. ప్రత్యేకించి గడచిన ఐదారు నెలల్లో ఈ సౌరతుపానుల సంఖ్య మరీ పెరిగిందట. సాధారణంగా సూర్యుడిలో ఈ సౌరతుపానులు రెండు రకాలుగా ఉంటాయి. సోలార్‌ మేగ్జిమమ్‌, సోలార్‌ మినిమమ్‌ గా వాటిని పిలుస్తారు. ప్రస్తుతం ఉచ్ఛదశలో సౌర తుపానులు ఏర్పడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement