Thursday, April 18, 2024

ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి.. టీజ‌ర్ అప్ డేట్

హీరో నాగ‌శౌర్య న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ చిత్రాన్ని శ్రీనివాస్‌ అవసరాల తెర‌కెక్కిస్తున్నాడు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానందా వంటి క్లాసికల్‌ లవ్‌స్టోరీల తర్వాత హీరో నాగశౌర్య, శ్రీనివాస్‌ అవసరాల కాంబోలో సినిమా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి.ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సగభాగం ఇండియాలో, మరో సగభాగం అమెరికాలో సాగనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పైగా వరుస హిట్‌లతో మంచి ట్రాక్‌ మేయింటేన్‌ చేస్తున్న పీపుల్‌ మీడియా ఈ సినిమాను నిర్మించడంతో జనాల్లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేస్తున్నట్లు డిఫరెంట్‌గా రేడియో ద్వారా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement