Tuesday, March 19, 2024

ఓటీటీలో బ‌లగం.. ఎప్పుడంటే

క‌మెడియ‌న్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం బ‌ల‌గం.ఈ చిత్రం ఈనెల 3న రిలీజ్ అయిన ఈ సినిమా 19 రోజుల్లో రూ. 19.97 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించింది.చిన్న సినిమాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న మూవీ బలగం. తెలంగాణ నేటివిటీకి దగ్గరగా ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. నిజజీవితానికి దగ్గరగా ఉన్న ఈ సినిమా తమ జీవితాలకు అద్దం పడుతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

అందుకే రోజురోజుకు ఈ చిత్రానికి వసూళ్ల ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయి మంచి ఆదరణ దక్కించుకున్న బలగం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది బ‌ల‌గం చిత్రం.కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం 7 లేదా 8వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement