Saturday, April 20, 2024

17 ఏళ్ల బాలికకు అరుదైన చికిత్స….కొడుపులో 2 కేజీల జుట్టు

శంషాబాద్ గగన్ పహాడ్ కు చెందిన పూజిత కు ఉస్మానియా వైద్యులు అరుదైన చికిత్స చేశారు. ఈ చికిత్స చేసి 150 సెంటి మీటర్ల పొడవైన రెండు కేజీల బరువున్న జుట్టు బంతిని తొలగించారు. గత మూడు నెలలుగా పొత్తి కడుపులో నొప్పి రావడంతో పూజిత ఉస్మానియా ఆసుపత్రికి వచ్చింది. అయితే వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించిన తర్వాత షాక్ కి గురయ్యారు. బాలికకు గత ఆరు నెలలుగా జుత్తుని మింగే అలవాటు ఉందని తెలుసుకున్నారు. అలాగే జూన్ 2న శస్త్రచికిత్స చేసి జుట్టు బంతిని తొలగించారు.

తమరి కార్డులో అప్పటి వరకు ఇలాంటి కేసులు 68 వరకు నమోదు అయ్యాయని… ఇది చాలా అరుదైన కేసు అని వైద్యులు తెలిపారు. రాపన్ జెల్ సిండ్రోమ్ లక్షణాలు కడుపు ఉబ్బరం, బరువు తగ్గడం, వాంతులు ,కడుపు నొప్పి, నెత్తి మీద జుట్టు రాలటం వంటి అని డాక్టర్స్ తెలిపారు. వైద్యులు తీవ్ర శ్రమ ఫలితంగా బాలిక ఇప్పుడు బతికి బయటపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement