Thursday, April 18, 2024

ఆస్కార్ అవార్డుల నామినేషన్స్

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల నామినేషన్లు ఖరారయ్యాయి. డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో వచ్చిన మాంక్ చిత్రం 10 విభాగాల్లో నామినేషన్లు సొంతం చేసుకుంది. ఇక బెస్ట్ డైరెక్టర్ విభాగంలో తొలిసారిగా ఇద్దరు మహిళలు (క్లో ఝావో, ఎమరాల్డ్ ఫెన్నెల్) నామినేట్ కావడం మరో విశేషం. ఝావో ఆస్కార్ నామినేషన్ పొందిన తొలి ఆసియా సంతతి మహిళ. కాగా ఆస్కార్ నామినేషన్ల వివరాలను లండన్ నుంచి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ ప్రకటించారు. ఈ 93వ అకాడమీ అవార్డుల ప్రదానం అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 25న జరగనుంది. కాగా, భారత్ నుంచి ఆస్కార్ కు వెళ్లిన తమిళ హీరో సూర్య చిత్రం సూరారై పొట్రు ఫైనల్ నామినేషన్స్ పొందడంలో విఫలమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement