Monday, March 20, 2023

ఐపీఎల్‌ నిర్వాహక మేనేజర్‌గా తెలుగు వ్యక్తికి అవకాశం..

ఐపీఎల్‌ 2023 నిర్వహణ జోనల్‌ మేనేజర్‌గా తెలుగు వ్యక్తికి అవకాశం లభించింది. 2023 ఐపీఎల్‌ సీజన్‌కోసం బీసీసీఐ ముగ్గురు జోనల్‌ ఆపరేషన్‌ మేనేజర్లను ఎంపిక చేసింది. వీరిలో దామోదర్‌ ఒకరు. ఈయన విశ్రాంత ఐపీఎస్‌ అధికారి. లక్నో, బెంగళూరు, గువాహటి, మొహాలి, చెన్నె, ముంబై, జైపూర్‌, ఢిల్లి, అహ్మదాబాద్‌లలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణలో ఆయన భాగస్వామ్యం అవుతారు.

- Advertisement -
   

ఐపీఎస్‌ అధికారిగా దామోదర్‌ అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక పదవులు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సేవలు అందించారు. చేపట్టిన ప్రతి బాధ్యతను విజవంతంగా పూర్తిచేసి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌ నిర్వహణలో పాలుపంచుకునే అవకాశం పొందడం తెలుగువారికి గర్వకారణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement