Wednesday, April 24, 2024

అందాల అనంతగిరి.. వ్యర్థాలతో నింపుతున్న పర్యాటకులు

వికారాబాద్‌ టౌన్‌, (ప్రభ న్యూస్‌): వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో గల అనంతగిరి అడవిలో వీకెండ్ వచ్చిందంటే చాలు పర్యాటకులు తాగి తందానా ఆడుతూ నానా హంగామా సృష్టిస్తున్నారు. ఈ విషయంలో స్పందించాల్సిన అటవి శాఖ సిబ్బంది గాని, పోలీసులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. అనంతగిరి, కోట్‌ పల్లి చుట్టుపక్కల ప్రాంతాలలో రిసార్ట్‌లలో ఉండి తిరిగి తమ తమ ప్రాంతాలకు వెలుతున్న వారిని పట్టుకుని డ్రంక్‌ ఆండ్‌ డ్రైవ్‌ కేసులు బుక్‌ చేస్తున్నారని పర్యాటకలు ఆరోపిస్తున్నారు.

అటవిలో వంటలు చేయటం, మద్యం సేవించటం సాధారణంగా మారగా. పోలీసులు మెయిన్‌ రోడ్‌లో చెకింగ్‌ నిర్వహిస్తూ కేసులు బుక్‌ చేస్తున్నారు. మెయిన్‌ రోడ్‌ మినహాయించి అనంతగిరి అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసిన మద్యం సీసాలు, ప్లాస్టిక్‌ కవర్లు ప్లేట్టు దర్శనం ఇస్తాయి. పోలీసులు కేవలం మెయిన్‌ రోడు పైనే తనిఖీలు నిర్వహించకుండా పర్యావరణాన్ని రక్షించటం కోసం అనంతగిరిలో తనిఖీలు నిర్వహించాలని స్ధానికులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement