Saturday, April 20, 2024

చైనాలో ఒకే ఒక్క కరోనా కేసు.. పట్టణమంతా లాకడౌన్​

చైనాలో కరోనాని కట్టడిచేయడానికి నిబంధనల ను చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. మూడు లక్షల జనాభా గల ఒక చిన్న పట్టణంలో ఒకే ఒక్క కరోనా కేసు బయటపడటంతో మొత్తం పట్టణం అంతా లాక్‌డౌన్‌ ప్రకటించారు. జీరో కోవిడ్‌ పాలసీని అమలు జేయడం కోసం ఇంత కఠినంగా నిబంధనలను అమలు జేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఈ చిన్న పట్టణంలో కూడా క్వారంటైన్‌ని అమలు జేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలనుతనిఖీలు నిర్వహించి అనుమానితులను క్వారంటైన్‌కి పంపుతున్నారు. హెనెన్‌ ప్రావిన్స్‌లో వ్యూగాంగ్‌ అనే పట్టణంలో లాక్‌డౌన్‌ నిబంధ నలను చాలా కఠినంగా అమలుజేస్తున్నారు. చైనాలో250 మిలియన్‌ ప్రజలు ఆంక్షలను పాటించాల్సి వస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement